Kesineni Nani: కాల్ మనీ రెచ్చిపోతోంది... డీజీపీ గారూ, కాపాడండి: కేశినేని నాని

  • ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
  • కాల్ మనీ గురించి మీకే ఎక్కువ తెలుసు
  • ప్రజలను కాపాడాలని ట్వీట్
ఏపీలో కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, డీజీపీ వెంటనే కల్పించుకుని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కోరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, కాల్ మనీ మాఫియా గురించి అందరి కన్నా మీకే ఎక్కువ తెలుసునని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మాఫియా బారిన పడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీలు కాపాడాలని కోరారు. "డీజీపీ గారు కాల్ మనీ మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ మీకే తెలుసు కాల్మని మాఫీయా బారిన పేద ప్రజలు పడకుండా కాపాడండి సార్" అంటూ సీఎం వైఎస్ జగన్ ను సైతం ట్యాగ్ చేశారు. 
Kesineni Nani
Cal Money
Twitter
Jagan
DGP

More Telugu News