MS Dhoni: ధోనీ అభ్యర్థనకు ఓకే చెప్పిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

  • ప్రపంచకప్ ముగిశాక తన కోరికను బయటపెట్టిన ధోనీ
  • రెండు నెలలపాటు పారాచూట్ రెజిమెంట్‌లో శిక్షణ
  • విండీస్ టూర్‌కు సైతం దూరం
రెండు నెలలపాటు ఆర్మీలో సేవ చేయాలని ఉందన్న టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అభ్యర్థనకు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఓకే చెప్పారు. దీంతో త్వరలోనే ధోనీ పారాచూట్ రెజిమెంట్ బెటాలియన్‌లో చేరి రెండు నెలలపాటు శిక్షణ పొందనున్నాడు. కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో ఈ శిక్షణ ఉండే అవకాశం ఉంది. ధోనీ రెండు నెలలపాటు శిక్షణలో ఉన్నా సైనిక చర్యల్లో భాగం కాబోడని తెలుస్తోంది. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అయిన ధోనీ.. ప్రపంచకప్ ముగిశాక తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఆర్మీలో రెండు నెలలు పాటు సేవ చేయాలని ఉందని వెల్లడించాడు. దీంతో విండీస్ టూర్‌కు సైతం దూరమయ్యాడు. ఇదే విషయమైన ఆర్మీ ఉన్నతాధికారులకు అభ్యర్థించాడు. పరిశీలించిన ఆర్మీ ధోనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
MS Dhoni
Army
Team India

More Telugu News