komatireddy ramgopal reddy: కేసీఆర్ కుటుంబం బండారం బయటపడే రోజులు దగ్గరపడ్డాయి: డీకే అరుణ

  • ప్రగతి భవన్ నిర్మాణంతోనే అవినీతికి బీజం పడింది
  • ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది
  • బీజేపీలో చేరిన కరీంనగర్ జిల్లా సీపీఐ కార్యదర్శి  
సీఎం కేసీఆర్ నియంత పాలనను అంతం చేసే శక్తి బీజేపీకే ఉందని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. డీకే అరుణ, ఎంపీ బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ జిల్లా సీపీఐ కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సిద్ధిపేటలో డీకే అరుణ మాట్లాడుతూ, ప్రగతి భవన్ నిర్మాణంతోనే అవినీతికి బీజం పడిందని, ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని, వారి బండారం బయటపడే రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మునిసిపల్ ఎన్నికల గురించి ఆమె ప్రస్తావిస్తూ ఎన్నికల్లో లబ్ధి కోసమే పెన్షన్ల హంగామా చేస్తున్నారని టీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ స్కామ్ లను బయటకు తీసి దోషులను జైలుకు పంపడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2023లో రాష్ట్రంలో కాషాయజెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
komatireddy ramgopal reddy
bjp
dk aruna
Bandi

More Telugu News