Vizag: అనకాపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్!

  • జాతీయ రహదారి మరమ్మతు పనులు
  • అనకాపల్లి- బయ్యవరం వరకు నిలిచిన వాహనాలు
  • ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు 
విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లిలోని జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనకాపల్లి నుంచి బయ్యవరం వరకు 7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి మరమ్మతు పనుల వల్ల వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. స్తంభించిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
Vizag
Anakapalli
Bayyavaram
National Highway

More Telugu News