Sheila Dixit: భారీ వర్షం నడుమ షీలా దీక్షిత్ అంత్యక్రియలు పూర్తి

  • ఢిల్లీలో జోరువాన
  • షీలా దీక్షిత్ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో నేతలు, అభిమానులు
  • అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. శనివారం మధ్యాహ్నం ఆమె గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. షీలా దీక్షిత్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె మృతి పట్ల పార్టీలకు అతీతంగా నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలోని నిగమ్ బోధ్ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో షీలా దీక్షిత్ అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీలో భారీ వర్షం కురుస్తున్నా, భారీ సంఖ్యలో నేతలు, అభిమానులు తరలివచ్చారు. అంతకుముందు, ఆమె భౌతికకాయాన్ని ఏఐసీసీ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆమె అంతిమయాత్ర సందర్భంగా భారీ జనసందోహం ఊరేగింపుగా నిగమ్ బోధ్ ఘాట్ వరకు వచ్చి తమ ప్రియతమ నేతకు కడసారి నివాళులు అర్పించింది.
Sheila Dixit
Delhi
Congress

More Telugu News