Anasuya: యాంకర్ అనసూయపై అసభ్యకర వ్యాఖ్యలు... పోలీసులకు ఫిర్యాదు

  • సోషల్ మీడియాలో అనసూయ పేరిట నకిలీ ఖాతాలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు
  • చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి
సోషల్ మీడియా వినియోగం వ్యాప్తి చెందిన తర్వాత సెలబ్రిటీలపై ట్రోలింగ్, అసభ్యకరమైన పోస్టులు ఎక్కువయ్యాయి. ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇలాంటి పోస్టులకు బాధితురాలేనని తెలుస్తోంది. సోషల్ మీడియాలో అనసూయపై అభ్యంతకరమైన రీతిలో పోస్టులు పెడుతున్నారంటూ ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంకర్ అనసూయ పేరుతో సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అశ్లీల, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు.
Anasuya
Police
Facebook

More Telugu News