KCR: ఉజ్జయినీ మహంకాళికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్

  • తెలంగాణలో బోనాల వేడుకలు
  • కుటుంబంతో కలిసి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్
  • తొలి బోనం సమర్పించిన తలసాని
తెలంగాణలో బోనాల సీజన్ నడుస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్మాతకు పట్టువస్త్రాలు సమర్పించారు. క్యూలో దర్శనం కోసం నిలుచున్న భక్తులను విష్ చేస్తూ ముందుకుసాగారు. కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అంతేగాకుండా, డప్పు వాయిద్యాలకు హుషారుగా కాలు కదిపారు.
KCR
Telangana
Hyderabad

More Telugu News