Ismart Shankar: మూడు రోజుల్లో రూ. 36 కోట్లు... సేఫ్ జోన్ లోకి 'ఇస్మార్ట్ శంకర్'!

  • తొలి వారంలోనే రూ. 50 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం
  • చానాళ్ల తరువాత పూరీకి బిగ్ హిట్
  • ఖుషీ అవుతున్న అభిమానులు
రామ్ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మాస్‌ మసాలా ఎంటర్‌ టైనర్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌', విడుదలైన మూడు రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఈ సినిమా తొలి మూడు రోజుల కలెక్షన్స్ రూ. 36 కోట్లకు పైనేనని చిత్ర యూనిట్ పేర్కొంది. ఆదివారం కూడా కలెక్షన్లు బాగానే ఉండవచ్చని, దీంతో తొలి వారంలోనే సినిమా కలెక్షన్లు రూ. 50 కోట్ల మార్క్ ను దాటుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాతో పూరీకి చాన్నాళ్ల తరువాత బిగ్ హిట్ రావడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Ismart Shankar
Collections
Ram
Puri Jagannadh

More Telugu News