YSRCP: ఇదొక రికార్డు... అంతా మీ ఆశీర్వాదమే: ట్విట్టర్ లో వైఎస్ జగన్

  • త్వరలోనే 4.01 లక్షల ఉద్యోగాల భర్తీ
  • 1.33 లక్షల శాశ్వత ఉద్యోగాలు
  • పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్న జగన్
అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4.01 లక్షల ఉద్యోగాలు భర్తీ కానున్నాయని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇదో రికార్డని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదబలంవల్లే ఇది సాధ్యమవుతోంది" అని అన్నారు.
YSRCP
Jagan
Twitter

More Telugu News