Beard KTR: అవును...ఆ గడ్డం, మీసంతో ఉన్న వ్యక్తి కేటీఆరే!

షార్ట్స్‌లో చూడండి
చతురోక్తులు, మాటకారితనం, ఆకట్టుకునే ముఖంతో ఎప్పుడూ హిందీ వ్యక్తిలా మీసం, గడ్డం లేకుండా దర్శనమిచ్చే టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ ముఖానికి ఆ రెండింటిని (మీసం, గడ్డం) జోడిస్తే ఎలావుంటుంది?... ఓ అభిమాని అదే పనిచేశాడు. ఓ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌ ఫొటోకు ఫేస్‌ యాప్‌ ద్వారా మీసం, గడ్డం పెట్టి ఆయనకే ట్వీట్‌ చేశాడు. ‘అన్నా...గడ్డం, మీసంతో మీరు మరింత అందంగా ఉన్నారు’ అంటూ వ్యాఖ్య జోడించాడు. దీన్ని చూసిన కేటీఆర్‌ అభిమానికి ట్విట్టర్‌లోనే కృతజ్ఞతలు తెలిపారు. ‘పర్వా లేదు (నాట్‌ బ్యాడ్‌)...ఇలా కూడా బాగానే ఉన్నాను’ అంటూ అభిమానికి సమాధానమిచ్చారు.
Go Back to Shorts
Beard KTR
twitter
fan

More Telugu News