Chandrababu: గాయని స్మితకు లేఖ పంపి ఆశ్చర్యానికి గురిచేసిన చంద్రబాబు

  • గాయనిగా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న స్మిత
  • అభినందించిన చంద్రబాబు
  • చంద్రబాబు స్పందనకు ముగ్ధురాలైన స్మిత
నిజంగా ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. సాధారణంగా చంద్రబాబునాయుడుకు రాజకీయాలే లోకం. ఆయన వినోద రంగం గురించి ఆలోచించడం అనేది అత్యంత అరుదైన విషయం. ఏ కాస్తో తీరిక దొరికితే కుటుంబంతో గడుపుతారు తప్ప కళాపోషణ చాలా తక్కువని చెప్పాలి. కానీ, ప్రముఖ తెలుగు గాయని స్మిత 20 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న మధుర క్షణాలను ఆయన గుర్తించి ఆమెకు ఓ లేఖ పంపి ఆశ్చర్యానికి గురిచేశారు.

శ్రోతలను సంతోషపెట్టేందుకు స్మిత సంగీతాన్ని వేదికగా చేసుకుని సాగిస్తున్న ప్రస్థానం అభినందనీయం అంటూ మొదలుపెట్టి, సంగీతానికి ఎల్లలు లేవన్న విషయాన్ని నిరూపిస్తూ ఏకంగా 9 భాషల్లో పాడడం మామూలు విషయం కాదంటూ స్మితను మనస్ఫూర్తిగా ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాగే గాన మాధుర్యాన్ని పంచాలంటూ అభిలషిస్తూ లేఖను ముగించారు. ఇక, టీడీపీ అధినేత నుంచి లేఖ రావడంతో స్మిత పరిస్థితి గాల్లో తేలుతున్నట్టే ఉంది. నిజంగా ఇది నాకు సర్ ప్రైజ్ అంటూ ముగ్ధురాలైంది. తనను అభినందిస్తూ లేఖ పంపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంది.
Chandrababu
Smitha
Tollywood
Telugudesam
Andhra Pradesh
Telangana

More Telugu News