Sheela Dixit: షీలా దీక్షిత్ హఠాన్మరణం చాలా బాధ కలిగించింది: చంద్రబాబు

  • ఢిల్లీ రాజకీయాల్లో షీలా ఓ యోధురాలన్న చంద్రబాబు
  • సీఎంగా ఎనలేని కృషి చేశారంటూ కితాబు  
  • దేశం ఓ ధైర్యశాలిని కోల్పోయిందన్న నారా లోకేశ్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలియజేశారు. షీలా దీక్షిత్ హఠాన్మరణం చెందారని తెలిసి ఎంతో బాధ కలిగిందని పేర్కొన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆమె ఒక యోధురాలిగా నిలిచారని ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన 15 ఏళ్ల పదవీకాలంలో రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక, షీలా దీక్షిత్ మృతి పట్ల టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా స్పందించారు. పార్టీలకు అతీతంగా గౌరవాభిమానాలు పొందారంటూ షీలా దీక్షిత్ ను కీర్తించారు. దేశం ఓ ధైర్యశాలిని కోల్పోయిందని ట్వీట్ చేశారు.
Sheela Dixit
New Delhi
Chandrababu
Nara Lokesh

More Telugu News