Ismaart Shankar: పక్కా మాస్ గెటప్పులో హెల్మెట్ కూడా లేకుండా 'ఇస్మార్ట్ శంకర్' చూడ్డానికి వెళుతున్నాం: ఆర్జీవీ

  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'
  • పూరీ పార్టీలో ఖుషీ చేసిన రామ్ గోపాల్ వర్మ
  • మరో ఇద్దరు శిష్యులతో కలిసి థియేటర్ కు పయనం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇస్మార్ట్ శంకర్ మేనియా నడుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన పక్కా మాస్ ఎంటర్టయినర్ 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ సినిమా చూసేందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉబలాటపడుతున్నారు. ఇప్పటికే తన శిష్యుడు పూరీ జగన్నాథ్ ఇచ్చిన పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన వర్మ ఇప్పుడు మరో ఇద్దరు శిష్యులతో కలిసి పక్కా మాస్ గెటప్పులో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చూసేందుకు థియేటర్ కు తరలివెళ్లారు.

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ నడుపుతుండగా వర్మ వెనుక కూర్చున్నారు. మధ్యలో లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు అగస్త్య కూడా ఉన్నారు. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ సందర్భంగా వర్మ, అజయ్ భూపతి మాస్ అప్పీల్ వచ్చే విధంగా ఓ కాలికి కర్చీఫ్, తలపై అడ్డదిడ్డంగా టోపీలు పెట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోను వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు.
Ismaart Shankar
RGV
Puri Jagannadh
Tollywood

More Telugu News