Puri Jagannadh: పూరీ జగన్నాథ్ పార్టీలో రామ్ గోపాల్ వర్మ సందడి మామూలుగా లేదు.. వీడియో చూడండి

  • 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో భారీ హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్
  • యూనిట్ తో కలసి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న పూరీ
  • రామ్ గోపాల్ వర్మకు పార్టీ
తన శిష్యుడు పూరీ జగన్నాథ్ అంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. 2015లో వచ్చిన 'టెంపర్' చిత్రం తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో పూరీ జగన్నాథ్ భారీ హిట్ కొట్టాడు. తన యూనిట్ తో కలసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తన గురువు వర్మకు పార్టీ ఇచ్చాడు. తన శిష్యుడి సక్సెస్ ను ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్న వర్మ... పార్టీలో రచ్చరచ్చ చేశాడు. పూరీకి, ఛార్మీకి హగ్ ఇచ్చిన వర్మ.. పూరీ చెంపపై గట్టిగా ముద్దిచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Puri Jagannadh
Ram Gopal Varma
Tollywood

More Telugu News