: కురియన్ ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్


పదిహేడేళ్ల నాటి కేరళ సూర్యనెల్లి అత్యాచారం కేసులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి పి.జె కురియన్ రాజీనామా చేయాలని విపక్షాలు కోరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను వెనకేసుకొచ్చింది. సంవత్సరాల నాటి ఈ కేసులో అప్పుడే సుప్రీంకోర్టు కురియన్ పై కేసును కొట్టివేసిందని రక్షణమంత్రి ఏకె ఆంటోనీ అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారనీ, వీటిపై కురియన్ వివరణాత్మకంగా ఇప్పటికే సోనియాకు లేఖ రాశారని కాంగ్రెస్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ మద్దతు పలికారు.

కాగా, 
ఈ అత్యాచార వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిలో కొనసాగేందుకు కురియన్ కు నైతిక హక్కు లేదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. మరోవైపు ఈ కేసులో తిరిగి నేర పరిశోధన చేయవలసిన అవసరం లేదని మరి కొందరు వాదిస్తున్నారు. 

  • Loading...

More Telugu News