Telangana: అందుకే, పార్టీ ఫిరాయింపులపై నిరసనలో పాల్గొనలేదు: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • పార్టీ ఫిరాయింపులపై నిన్న టీసీఎల్పీ నిరసన తెలిపింది
  • ఆ కార్యక్రమంలో నేను పాల్గొనలేదు
  • ఎందుకంటే, గతంలో నేనూ రెండుసార్లు పార్టీ మారాను
పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ నిన్న టీసీఎల్పీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో జగ్గారెడ్డి పాల్గొనలేదు. ఈ విషయమై జగ్గారెడ్డిని ప్రశ్నించగా, దీని గురించి పీసీసీ తనను అడిగిందని, తనకు కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయని చెప్పానని అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా పని చేస్తానని చెప్పిన జగ్గారెడ్డి, పార్టీ ఫిరాయింపులపై నిరసన చేపట్టడం పార్టీ నిర్ణయం  కాదని, అది టీసీఎల్పీ నిర్ణయం అని అన్నారు. గతంలో తాను కూడా రెండు సార్లు పార్టీ మారానని, అందుకే, పార్టీ ఫిరాయింపులపై చేపట్టిన నిరసనలో పాల్గొనలేకపోతున్నానని భట్టి విక్రమార్కకు చెప్పానని, అందుకు, ఆయన కూడా కాదనలేకపోయారని, వ్యక్తిగత అభిప్రాయాలను ఎవరూ చంపలేరని అన్నారు. 
Telangana
Sangareddy
Mla
Jaggareddy

More Telugu News