roti bank: విద్యార్థుల సత్సంకల్పం...అభాగ్యుల ఆకలి తీర్చేందుకు ‘రోటీ బ్యాంక్‌’

షార్ట్స్‌లో చూడండి
సదాశయానికి జనం కూడా సహకరిస్తారు. వారంతా చదువుకుంటూ భవిష్యత్తుకోసం కష్టపడుతున్న విద్యార్థులు. తాము జీవితంలో స్థిరపడేందుకు కష్టపడడం తప్పని సరైనా, కొంత పరోపకారం చేద్దామన్న ఉద్దేశంతో అనాథల కడుపు నింపాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. కానీ అంతమొత్తం డబ్బు పెట్టుబడి పెట్టే స్థాయి వారికి లేదు. అందుకే ‘రోటీ బ్యాంక్‌’ ఏర్పాటు చేశారు. ఓ వాహనాన్ని సమకూర్చుకుని ఇంటింటికీ వెళ్లి రోటీలు సేకరిస్తున్నారు.

అనంతరం ఆకలితో అలమటిస్తున్న వారికి వాటిని పంపిణీ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని బర్దోలీకి చెందిన కొందరు విద్యార్థుల సదాశయానికి స్థానికులు ఎంతో సాయపడుతున్నారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకే గృహస్థుల్లో మిగులు ఆహారాన్ని సేకరించి వీరి ఆకలి తీరుస్తున్నామని విద్యార్థులు తెలిపారు.
Go Back to Shorts
roti bank
Gujarat
surat
students service

More Telugu News