Telangana: గన్ మెన్ హఠాన్మరణం.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్!

  • తెలంగాణలోని మహబూబాబాద్ లో ఘటన
  • గన్ మెన్ శ్రీనివాస్ తో ఎమ్మెల్యేకు మంచి అనుబంధం
  • అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యే నాయక్
రాజకీయ నేతలు అన్నాక భావోద్వేగాలకు అతీతంగా ఉంటారని భావిస్తాం. కానీ తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్(ఎస్టీ) ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాత్రం ఇందుకు భిన్నం. చాలాకాలంగా తన దగ్గర గన్ మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ తో శంకర్ నాయక్ కు మంచి అనుబంధం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో శ్రీనివాస్ హఠాన్మరణంతో ఆయన తీవ్రమైన షాక్ కు గురయ్యారు. శ్రీనివాస్ భౌతికకాయాన్ని చూడగానే భోరున విలపించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడెను సైతం మోశారు. గన్ మెన్ శ్రీనివాస్ ను ఎమ్మెల్యే తన కుడిభుజంగా భావించేవారని స్థానికులు తెలిపారు. 
Telangana
mahabubabad
TRS
mla
Shankar naik
cry
Gun mendead

More Telugu News