ismart Shanker: 'ఇస్మార్ట్ శంకర్' తొలిరోజు వసూళ్ల వివరాలు!

  • నిన్న విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్'
  • మాస్ ఆడియన్స్ ను మెప్పించిన సినిమా
  • తొలి రోజు రూ. 7.8 కోట్ల షేర్
రామ్ పోతినేని హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిన్న విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' మాస్ ప్రేక్షకులను మెప్పించి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.8 కోట్ల షేర్ ను వసూలు చేసింది. నైజాంలో సినిమాకు మంచి ఆదరణ లభించగా, రూ. 3.43 కోట్లు కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక సీడెడ్ లో రూ. 1.20 కోట్లు, వైజాగ్ రూ. 86 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 50 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 53 లక్షలు, గుంటూరులో రూ. 57 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలు వసూలయ్యాయని పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. 
ismart Shanker
Collections
Andhra Pradesh
Telangana
Ram
Puri Jagannadh

More Telugu News