Swapna: వివాహేతర సంబంధం పెట్టుకుందని.. మహిళపై దాడి!

  • స్వప్న, నారాయణలను నిలదీసిన గ్రామస్తులు
  • పరారైన నారాయణ.. దొరికిపోయిన స్వప్న
  • స్వప్నకు లక్షల్లో డబ్బు ముట్టజెప్పాడని ఆరోపణ
కట్టుకున్న భర్తను వదిలేసి వేరొక వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో గ్రామస్తులు ఓ మహిళను పట్టుకుని ట్రాక్టర్‌కు కట్టేసి మరీ కొట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చిన్న బోనాలులో జరిగింది. స్వప్న అనే వివాహితకు అదే గ్రామానికి చెందిన నారాయణతో వివాహేతర సంబంధం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆమెకు నారాయణ లక్షల్లో డబ్బు ముట్టజెప్పాడని, కుటుంబ సభ్యులను సైతం పట్టించుకోవట్లేదని తెలిపారు.

స్వప్న భర్త డబ్బు సంపాదించడం కోసం దుబాయ్ వెళ్లినప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోందన్నారు. నారాయణ, స్వప్నలిద్దరినీ గ్రామస్తులు పట్టుకుని నిలదీయగా, నారాయణ పరారయ్యాడు. దీంతో స్వప్నను ట్రాక్టర్‌కు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
Swapna
Narayana
Rajanna Sircilla District
Dubai
Tractor
Villagers
Police

More Telugu News