Bigg Boss-3: 'బిగ్ బాస్' వివాదంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సినీ నటి హేమ

  • నిర్వాహకులు అసభ్యంగా మాట్లాడివుంటే అప్పుడే నిలదీయాల్సిందన్న హేమ
  • సెలెక్ట్ కాలేదని తెలిసిన తర్వాత ఆరోపణలు చేయడం సబబు కాదంటూ హితవు
  • బిగ్ బాస్-3లో అవకాశం వస్తే తప్పక పాల్గొంటానన్న హేమ 
బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనాలంటే 'సంతృప్తి' పరచాలంటూ వేధిస్తున్నారని యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్ వంటి తీవ్రమైన సమస్య బిగ్ బాస్ షోలో ఉంటే హోస్ట్ గా చేసేందుకు నాగార్జున ఎందుకు ఒప్పుకుంటారని హేమ ప్రశ్నించారు. ఒకవేళ నిర్వాహకులు నిజంగానే అసభ్యకరంగా మాట్లాడి ఉంటే అప్పుడే స్పందించాలి కానీ, నెల రోజుల క్రితం జరిగిందంటూ ఇప్పుడు బయటికొచ్చి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.

సెలెక్ట్ కాలేదని తెలిసిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం న్యాయం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. తన విషయంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆరోజే స్పందిస్తానని, అప్పుడే వాళ్ల చొక్కా పట్టుకుని నిలదీస్తానని హేమ స్పష్టం చేశారు. ఒకవేళ బిగ్ బాస్-3లో తనకు అవకాశం కల్పిస్తే తప్పక పాల్గొంటానని, పాలిటిక్స్ లోకి వస్తున్న తనపై ప్రజల్లో ఎలాంటి భావనలు ఉన్నాయో ఈ షో ద్వారా తెలుసుకుంటానని అన్నారు.
Bigg Boss-3
Hema
Tollywood
Nagarjuna

More Telugu News