Andhra Pradesh: మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ‘నెల్లూరు రౌడీ’గా అభివర్ణించిన టీడీపీ నేత

  • మంత్రి అనిల్ పై టీడీపీ ఎమ్మెల్సీల మండిపాటు
  • అనిల్ ను సీఎం జగన్ అదుపులో పెట్టాలి
  • క్యూసెక్ కి, టీఎంసీకి తేడా తెలియని వ్యక్తి మంత్రా!
ఏపీ ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనిల్ కుమార్ ను ఓ రౌడీగా అభివర్ణించారు. నెల్లూరు రౌడీ, మంత్రి అనిల్ ను సీఎం జగన్ అదుపులో పెట్టాలని సూచించారు.

టీడీపీ మరో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, క్యూసెక్ కి, టీఎంసీకి తేడా తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్నారని విమర్శించారు. అనిల్ తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. శాసనమండలిలో తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు.
Andhra Pradesh
Nellore
minister
anil
Telugudesam

More Telugu News