Andhra Pradesh: ఎక్కడకు వెళ్లాలన్నా హైదరాబాద్ నుంచి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు!: ఏపీ సర్కారుపై చంద్రబాబు ఆగ్రహం

  • నేను ఉంటున్న ఇల్లు పరీవాహక ప్రాంతం కిందకు రాదు
  • కృష్ణా నదిలోని ఓ పాయ ఇటువైపుగా ప్రవహిస్తోంది
  • అమరావతిలో మీడియాతో చంద్రబాబు ముచ్చట్లు
ఉండవల్లిలోని తన నివాసం కృష్ణానది పరీవాహక ప్రాంతం కిందకు రాదని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు గూగుల్ మ్యాప్ లో చూసినా కృష్ణా నదిని భవానీ ద్వీపం నుంచి చూపిస్తుందని వ్యాఖ్యానించారు. బ్యారేజీ ఉండటం వల్ల నదిలోని ఓ పాయ చీలి ఇటువైపుగా ప్రవహిస్తోందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీడీపీ అధినేత మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు.

కొత్త ప్రభుత్వం వచ్చాక గన్నవరం ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలు తగ్గిపోయాయని చంద్రబాబు అన్నారు. సింగపూర్ విమాన సర్వీసుతో పాటు చాలా విమానాలను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా హైదరాబాద్ నుంచే వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
HOUSE
KRISHNA RIVER

More Telugu News