మాయావతికి ఝలక్.. రూ.400 కోట్ల ప్లాట్ ను జప్తు చేసిన ఐటీ శాఖ!
- మాయావతి సోదరుడి పేరుపై ఉన్న ప్లాట్
- బినామీ చట్టం కింద జప్తు చేసిన ఐటీ అధికారులు
- నేరం రుజువైతే ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బినామీ వ్యవహారాల నిరోధక (సవరణ) చట్టం-2016 ప్రకారం బినామీ ఆస్తులు కలిగి ఉంటేవారికి ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అలాగే ఆస్తి విలువలో 25 శాతం మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఐటీ అధికారులు జప్తు చేసిన స్థలం ఏడు ఎకరాల వరకు ఉందనీ, ఈ ఆస్తి పుస్తక విలువే రూ.400 కోట్ల మేరకు ఉంటుందని సమాచారం. కొత్త బినామీ చట్టం అమలు విషయంలో ఐటీ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.