Boy: తప్పిపోయి ఆరు కిలోమీటర్లు ఒంటరిగా, రాత్రిపూట నడిచిన ఐదేళ్ల బాలుడు!

షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లా పుట్లూరు సమీపంలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన బాలుడు, రాత్రిపూట ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కొండుగారికుంట ప్రాంతానికి చెందిన చిరంజీవి, శ్రావణి దంపతుల కుమారుడు హేమంత్ అనే బాలుడు, మంగళవారం రాత్రి ఇంటి బయట ఆడుకుంటూ, సమీపంలోని తోటలోకి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, గ్రామస్తుల సాయంతో మంగళవారం రాత్రంతా గాలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెల్లారిన తరువాత అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలోని చాలవేముల దగ్గరున్న సబ్ స్టేషన్ వద్ద హేమంత్ ను చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి దారి తెలియక ఆరు కిలోమీటర్ల దూరం హేమంత్ వచ్చాడని తెలుసుకుని పోలీసులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తమ బిడ్డ తిరిగి కనిపించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Go Back to Shorts
Boy
Anantapur District
Walking
Night
Police

More Telugu News