Andhra Pradesh: 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ... జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు!

  • అమరావతిలో సమావేశమైన మంత్రిమండలి
  • పలు చట్టాల సవరణలకు ప్రతిపాదనలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు
ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం అమరావతిలో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు, చట్టసవరణ ముసాయిదాలకు క్యాబినెట్ ఆమోదం పలికింది. జుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటుపై చట్ట సవరణకు చేసిన ప్రతిపాదనలకు క్యాబినెట్‌ పచ్చజెండా ఊపింది.

ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని, నామినేటెడ్‌ వర్క్‌ లు కేటాయించేలా చట్టం తీసుకురావాలని కూడా కేబినెట్‌ నిర్ణయించింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,33,867 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. భూముల రికార్డులపై క్యాబినెట్‌ చట్టసవరణను, గ్రామీణ ప్రాంతాల్లో 11,114 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటుకు మంత్రి మండలి అంగీకారం తెలిపింది. అక్వా రైతుల నుంచి యూనిట్ విద్యుత్ కు రూ. 1.50 మాత్రమే వసూలు చేయాలని కూడా జగన్ క్యాబినెట్ నిర్ణయించింది.
Andhra Pradesh
Jagan
Cabinet
Meeting
Amaravati

More Telugu News