Uttar Pradesh: అందంగా తయారై వచ్చిన మహిళా కానిస్టేబుళ్లు... ఎస్ఐ సహా చిక్కిన పలువురు రోమియోలు!

  • యూపీలో పెరిగిన రోమియోల ఆగడాలు
  • వినూత్నంగా స్పందించిన యాంటీ రోమియో స్క్వాడ్
  • పలువురు పోకిరీల అరెస్ట్
రోడ్డుపై వెళుతుంటే పోకిరీలు నిత్యమూ వేధిస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్న ఫిర్యాదులు పెరగడంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర యాంటీ రోమియో స్క్వాడ్ వినూత్నంగా స్పందించింది. రాంపూర్, షహబాద్ ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లు మఫ్టీలో అందంగా అలంకరించుకుని కాలేజీ అమ్మాయిల్లా వీధుల్లోకి వచ్చారు. వారిని చూసి వేధించాలని ప్రయత్నించిన పలువురు రోమియోలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిలో రోమియోగా మారిన ఓ సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్ స్టెక్టర్ కూడా ఉండటం గమనార్హం. ఈవ్ టీజింగ్ ను అరికట్టి, అమ్మాయిల్లో అవగాహన తెచ్చేందుకే ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని అధికారులు వెల్లడించారు.
Uttar Pradesh
Romeos
Lady Conistable

More Telugu News