KCR: రేపటి నుంచి తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు

  • నూతన పరిపాలక బిల్లుపై చర్చ
  • 1965, 1994 చట్టాల స్థానంలో నూతన బిల్లు
  • బిల్లుకు ఆమోదం తెలిపేందుకు సమావేశాలు
రేపటి నుంచి తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగుతున్న సమావేశంలో నూతన పరిపాలక బిల్లుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. 1965 తెలంగాణ మున్సిపల్ చట్టం, 1994 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల స్థానంలో నూతన బిల్లును రూపొందించారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. దీంతో పాటు గతంలో జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులకు, ఇతర నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.


KCR
Pragathi bhavan
Telangana
Municipal
Cabinet

More Telugu News