Andhra Pradesh: రివర్స్ టెండరింగ్ అంటూ డ్రామాలు ఆడొద్దు: జగన్ పై దేవినేని మండిపాటు

  • పోలవరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు కరెక్టు కాదు
  • ఆ ఆరోపణలను నిరూపించండి
  • జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయాలి
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్ చేస్తున్న అవినీతి ఆరోపణలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి అరవై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కరెక్టు కాదని, ఆ ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలే తప్ప, ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. రివర్స్ టెండరింగ్ అంటూ డ్రామాలు ఆడొద్దని జగన్ కు సూచించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు కోసం ఒక బొచ్చ సిమెంట్ అయినా వేశారా? అని ప్రశ్నించారు.
Andhra Pradesh
polavaram
project
devineni

More Telugu News