Bigg Boss: బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు ఆదేశం

షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్ రియాల్టీ షో నిర్వాహకులకు హైకోర్టులో ఊరట లభించింది. రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో వారం రోజుల లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. కాగా, బిగ్ బాస్ మేనేజ్ మెంట్ పై యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నిర్వాహకులు లైంగికంగా వేధిస్తున్నారంటూ వారిద్దరూ సంచలన ఆరోపణలు చేశారు.
Go Back to Shorts
Bigg Boss
High Court

More Telugu News