Chandrababu: ఏపీ కొత్త గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

  • ఏపీ నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియామకం
  • స్వాగతించిన ఏపీ ప్రముఖులు
  • సమర్థంగా రాణిస్తారన్న నమ్మకం ఉందంటూ చంద్రబాబు ట్వీట్
నవ్యాంధ్రప్రదేశ్ కు బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త గవర్నర్ గా నియమితుడైన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన ఈ సీనియర్ రాజకీయవేత్తను కేంద్రం ఏపీకి నూతన గవర్నర్ గా నియమించింది. ఏపీ రాజకీయ ప్రముఖులు బిశ్వభూషణ్ హరిచందన్ నియామకాన్ని స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొత్త గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు. "ఏపీ కొత్త గవర్నర్ గా బాధ్యతలు అందుకుంటున్న శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. అపార అనుభవం, పేరుప్రఖ్యాతులు ఉన్న విలక్షణ నేతగా శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు తమ కొత్త పాత్రలో సమర్థంగా రాణిస్తారని విశ్వసిస్తున్నాం" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Governror
Andhra Pradesh

More Telugu News