actress: ఇక పూర్తిస్థాయి రాజకీయాల్లోకి: సినీనటి హేమ

  • సినీ పరిశ్రమను విడిచి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నా
  • రాజమండ్రిలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నా
  • జగన్‌పై హేమ ప్రశంసలు
టాలీవుడ్ ప్రముఖ సినీనటి హేమ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. రాజమండ్రిలో ఇల్లు కట్టుకుంటున్నానని, హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమను వీడి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. కాపుల కోసం బడ్జెట్‌లో రెండువేల కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయమన్నారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున పోటీచేసిన హేమ ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలో చేరినా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాలేదు. తాజాగా, సినీ పరిశ్రమకు దూరంగా పూర్తిగా రాజకీయాలకే అంకితం కావాలనుకుంటున్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
actress
Tollywood
Hema
Jagan
Andhra Pradesh

More Telugu News