New Delhi: తెలుగు రాష్ట్రాల లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలో సన్మానం

  • తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం
  • ఎంపీలను సన్మానించిన మోహన్ కందా, నాగరాజు
  • తెలుగు వారందరం భాషా పరంగా కలిసే ఉంటున్నాం: విజయసాయిరెడ్డి
ఢిల్లీలో తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు సన్మానం జరిగింది. ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంపీలను తెలుగు అకాడమీ చైర్మన్ మోహన్ కందా, ప్రధాన కార్యదర్శి నాగరాజు సన్మానించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ నారాయణ, కేంద్ర సమాచార శాఖ కార్యదర్శి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.

భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రాలు సమష్టిగా ముందుకెళ్లాలి

ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాలుగా వేరైనా తెలుగు వారందరం భాషా పరంగా కలిసే ఉంటున్నామని అన్నారు. భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రాలు సమష్టిగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో తెలుగు వారంతా కలిసే ఉంటున్నారని అన్నారు.

తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్నాం

టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల ప్రజల సమస్యల పరిష్కారానికి సభలో గళం వినిపిస్తున్నామని, తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పారు.
New Delhi
Andhra Pradesh
Telangana
Mp`s

More Telugu News