Jagan: బడ్జెట్ పై చర్చలో ఎవరేం మాట్లాడాలి?... వైసీపీ ప్రజాప్రతినిధులకు సీఎం జగన్ దిశానిర్దేశం

  • రేపు బడ్జెట్ పై చర్చ!
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ క్లాస్
  • ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో భేటీ అయిన చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో రేపు బడ్జెట్ పై చర్చ జరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు విపక్షం ఇరకాటంలో పెట్టేందుకే ప్రయత్నిస్తుంది కాబట్టి, దీటుగా ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై సీఎం జగన్ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

 రేపు ప్రధానంగా చర్చకు వచ్చే ప్రశ్నలు, ఎవరేం మాట్లాడాలన్న అంశంపైనా జగన్ దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా, బడ్జెట్ పై చర్చ సందర్భంగా తమవైపు నుంచి లేవనెత్తాల్సిన అంశాలపైనా, పరిస్థితులకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలన్న దానిపైనా పలు సూచనలు చేశారు. అటు, విపక్ష నేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. రేపు శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు.
Jagan
Chandrababu
Andhra Pradesh
Budget
Telugudesam
YSRCP

More Telugu News