Katherine Hadda: చీరకట్టుతో దిగిన ఫొటోలను ట్విట్టర్ లో పెట్టిన అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా

  • హైదరాబాద్ లో వీసా మంజూరు అధికారిణిగా క్యాథరిన్ హడ్డా సుపరిచితం
  • భారతీయ సంస్కృతిపై మక్కువ
  • చీరకట్టుతో ఫొటోలకు పోజులు
హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను బాగా వంటబట్టించుకున్నారు. కేవలం అమెరికా వెళ్లే భారతీయులకు వీసాలు మంజూరు చేసే అధికారిణిగా కాకుండా, స్థానిక సమాజంతో ఆమె మమేకమైన తీరు ఆకట్టుకుంది. అమెరికా జాతీయురాలైన క్యాథరిన్ హడ్డాను చూస్తే భారతీయ ఆహార్యం ఉట్టిపడుతుంది. తాజాగా, ఆమె చీరకట్టుతో దిగిన ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు. అయితే పాతకాలపు భారతీయ వనితను ప్రతిబింబించేలా ఆమె వస్త్రధారణ ఉంది. నిండైన చీరకట్టుతో పలు సందర్భాల్లో ఆమె తీయించుకున్న ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు.
Katherine Hadda
USA
Hyderabad

More Telugu News