World Cup: ప్రపంచకప్ విజేతగా ఇంగ్లాండ్ ను ప్రకటించడంపై అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలు

  • బౌండరీల నిబంధనతో వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లాండ్
  • ఐసీసీపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • ట్వీట్ తో చురక అంటించిన అమితాబ్
వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడం పట్ల బాలీవుడ్ అగ్రశ్రేణి నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆయన వ్యంగ్యధోరణిలో ఐసీసీ నిర్ణయాన్ని విమర్శించారు. ఇద్దరు వ్యక్తుల వద్ద చెరో రూ.2000 ఉంటే, వాళ్లిద్దరిలో ధనవంతుడు ఎవరు? అంటూ తన ట్వీట్ మొదలుపెట్టిన అమితాబ్, దానికి అద్భుతమైన ముగింపునిచ్చారు. ఒకరి వద్ద రూ.2000 నోటు ఉండగా, మరొకరి వద్ద నాలుగు రూ.500 నోట్లు ఉన్నాయని, ఐసీసీ ప్రకారం ఎక్కువ నోట్లు ఉన్న వ్యక్తే ధనవంతుడు అంటూ సెటైర్ వేశారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల స్కోర్లు టై కాగా, సూపర్ ఓవర్ లో సైతం స్కోర్లు సమం అయ్యాయి. దాంతో, బౌండరీలు ఎక్కువగా బాదిన జట్టుగా ఇంగ్లాండ్ ప్రపంచకప్ ఎగరేసుకెళ్లింది. దాంతో ఈ బౌండరీల నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
World Cup
England
Amitabh Bachchan

More Telugu News