Andhra Pradesh: చెన్నైలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు తెలుగమ్మాయిల మృతి

  • ఆఫీసుకు వెళుతుండగా ఘటన
  • యువతులు ప్రయాణిస్తున్న బైక్ ను మరో బైక్ ఢీ కొట్టిన వైనం
  • అదుపుతప్పి పక్కనే వస్తున్న బస్సుకింద పడిన యువతులు
ఆఫీసుకు వెళ్లే క్రమంలో ఇద్దరు ఏపీ యువతులకు నూరేళ్లు నిండిపోయాయి! చెన్నైలో తమ సహోద్యోగితో కలసి ఇద్దరు యువతులు ఒకే బైక్ పై ఆఫీసుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏపీకి చెందిన భవాని, లక్ష్మి అనే యువతులు ఉపాధి కోసం చెన్నైలో ఓ కార్యాలయంలో పనిచేస్తున్నారు. తమ కొలీగ్ శివన్ తో కలిసి వీరు బైక్ పై వెళుతుండగా, మరో బైక్ ఢీకొట్టింది. దాంతో శివన్ బైక్ ను కంట్రోల్ చేయలేకపోయాడు. అదే సమయంలో ఓ బస్సు దూసుకురావడంతో ముగ్గురు దాని కిందికి వెళ్లిపోయారు. ఈ ఘటనలో భవాని, లక్ష్మి ప్రాణాలు కోల్పోగా, శివన్ చావుబతుకుల్లో ఉన్నాడు. ప్రస్తుతం అతడు రాయపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Andhra Pradesh
Chennai
Road Accident

More Telugu News