Andhra Pradesh: ప్రజలు ఛీ కొట్టేలా తెలుగుదేశం సభ్యుల తీరు: రోజా మండిపాటు

  • ఇంకా ఏ విషయాన్నీ ప్రజలు మరచిపోలేదు
  • సంప్రదాయం గురించి బాబు మాట్లాడటం హాస్యాస్పదం
  • సభలో సమయాన్ని వృథా చేస్తున్నారన్న రోజా
అసెంబ్లీలో తెలుగుదేశం నేతలు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు ఛీకొట్టేలా ఉందని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు మాట్లాడిన ఆమె, గత శాసనసభలో జరిగిన ఏ అంశాన్నీ ప్రజలింకా మరచిపోలేదని వ్యాఖ్యానించారు. తమను రౌడీలని, గూండాలని బెదిరించిన రోజులు ఇంకా గుర్తున్నాయని, కావాలంటే వాటి క్లిప్పింగ్స్ వేసి చూపిస్తామని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు సభా సంప్రదాయాలను గురించి మాట్లాడుతూ ఉండటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

తాను ఓ మహిళా ఎమ్మెల్యేనన్న గౌరవం కూడా ఇవ్వకుండా గత అసెంబ్లీలో తెలుగుదేశం నేతలు ఎలా మాట్లాడారన్న రికార్డులు ఉన్నాయని అన్నారు. అచ్చెన్నాయుడి తీరును చూసి రాష్ట్రమంతా అసహ్యించుకుంటోందని రోజా నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల పాలన ప్రజలకు నచ్చలేదు కాబట్టే ప్రజలు జగన్ కు అధికారాన్ని ఇచ్చారని, ఓటమి కారణంగా వచ్చిన ఫ్రస్ట్రేషన్ నుంచి ఇంకా బయటపడలేని తెలుగుదేశం నేతలు, ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ, సభలో సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శించే దారి కనిపించకనే, మాట్లాడాల్సిన చంద్రబాబు తన గదికి పారిపోయి, మైక్ ను బుచ్చయ్య చౌదరికి అప్పగించారని రోజా ఎద్దేవా చేశారు. 
Andhra Pradesh
Roja
Chandrababu
Assembly

More Telugu News