Chandrababu: చంద్రబాబుకు స్పీకర్ సూటి ప్రశ్న.. స్పీకర్ కు చంద్రబాబు ఎదురు ప్రశ్న

  • అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? అన్న తమ్మినేని
  • రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అన్న చంద్రబాబు
  • చంద్రబాబు ప్రశ్నను తప్పుబట్టిన అంబటి
ఏపీ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. తాను ఏం మాట్లాడాలో మీరు రాసిస్తే, తాను చదువుతానంటూ స్పీకర్ ను ఉద్దేశించి టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళాన్ని సృష్టించాయి. అచ్చెన్న వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అంటూ చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా తాను సమర్థించనని చంద్రబాబు చెప్పారు. తనపై వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? అని స్పీకర్ ను చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, స్పీకర్ ను చంద్రబాబు ప్రశ్నించడాన్ని అంబటి రాంబాబు తప్పుబట్టారు. సభలో అత్యంత సీనియర్ అయిన నాయకుడు స్పీకర్ ను ప్రశ్నించడం ఏమిటని అన్నారు.

ఒకప్పుడు సభలో మాట్లాడటానికి ఎన్టీఆర్ కు కూడా చంద్రబాబు మైక్ ఇవ్వలేదని రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే స్పీకర్ ను చంద్రబాబు ప్రశ్నించారు.
Chandrababu
Tammineni
Ambati
Telugudesam
YSRCP
Assembly

More Telugu News