Achennaidu: మీరు రాసివ్వండి, దాన్నే చదువుతానన్న అచ్చెన్నాయుడు.. స్పీకర్ ఆగ్రహం

  • గందరగోళం మధ్య కొనసాగుతున్న శాసనసభ సమావేశాలు
  • అచ్చెన్న వ్యాఖ్యలను తప్పుబట్టిన స్పీకర్
  • ఇదేమైనా బజారు అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం
ఏపీ శాసనసభ సమావేశాలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభంకాగానే టీడీపీ తరపున మాట్లాడే అవకాశం అచ్చెన్నాయుడికి ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా... త్వరగా ముగించాలంటూ స్పీకర్ సూచించారు. తాను సబ్జెక్ట్ కే వస్తున్నానని... లేకపోతే మీరే రాసివ్వండి, దాన్నే చదువుతానంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు రాసివ్వండి. నేను చదువుతాను. ఏం వ్యాఖ్యలు ఇవి' అని ప్రశ్నించారు. ఇదేమైనా బజారు అనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరిస్తే సభను నిర్వహించడం చాలా కష్టమవుతుందని అన్నారు. 
Achennaidu
Telugudesam
Tammineni
YSRCP
Assembly

More Telugu News