Khammam District: టిక్ టాక్ లో మునిగితేలిన ఖమ్మం అధికారులపై చర్యలు!

  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు
  • తొలుత సెక్షన్లు మార్చిన అధికారులు
  • ఆపై శానిటేషన్ విభాగానికి బదిలీ
ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది టిక్ టాక్ లో మునిగితేలుతున్నట్టు తెలుసుకున్న అధికారులు, వారి సెక్షన్లు, డిపార్టుమెంట్లు మార్చారు. సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడిందని విమర్శలు రావడంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు, తొలుత వారి సెక్షన్లను మార్చారు. ఆ తరువాత కూడా వీరి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటంతో, ఈ వీడియోలు చేసిన అందరినీ శానిటేషన్ విభాగానికి మారుస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గత కొంత కాలంగా కార్పొరేషన్ ఉద్యోగులు టిప్ టాప్ గా తయారై వచ్చి, టిక్ టాక్ వీడియోలను తీసుకుంటూ, విధులను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.
Khammam District
Tik tok
Videos

More Telugu News