Elephant: ఆడ ఏనుగుపై లైంగికదాడి చేసి చంపేసిన మదపుటేనుగు!

  • చిత్తూరు జిల్లా పలమనేరు అడవుల్లో ఘటన
  • ఏనుగు మృతదేహానికి పోస్టుమార్టం
  • లైంగిక దాడికి గురైనట్టు తేల్చిన వైద్యులు
ఒక మదపుటేనుగు జరిపిన లైంగిక దాడిలో ఓ ఆడ ఏనుగు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో వెలుగుచూసింది. మండిపెంట అటవీ బీట్ పరిధిలో ఓ ఏనుగు మృతదేహం కనిపించగా, స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారులు ఏనుగు మృతదేహాన్ని పరిశీలించి, తొలుత అనారోగ్యం కారణంగా మరణించివుండవచ్చని భావించారు. అయితే, పోస్ట్ మార్టం చేసిన వైద్యులు, అది లైంగిక దాడికి గురై చనిపోయినట్టు తేల్చారు. మృతి చెందిన ఏనుగుతో పాటు పిల్ల ఏనుగు కూడా ఉండాలని, అది ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని వాచర్లు వెల్లడించారు.
Elephant
Chittoor District
Died
Rape

More Telugu News