Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సలహాలు ఇవ్వనంటున్న రకుల్ 
  • 'ఇస్మార్ట్ శంకర్'కి A సర్టిఫికేట్ 
  • వచ్చే నెల నుంచి 'భారతీయుడు 2'
*  స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఎవరికీ తాను ఎటువంటి సలహాలూ ఇవ్వనని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'ఈ రోజుల్లో ఎవరికీ ఎందులోనూ సలహాలు ఇవ్వక్కర్లేదు. ఏ విషయంలోనైనా ఎవరి నిర్ణయాలు వారు తీసుకోగలరు. అందుకే, నేను ఎవరికీ సలహాలు ఇవ్వను. అందుకే స్నేహితులతో నాకు చక్కని బంధం కొనసాగుతోంది' అని చెప్పుకొచ్చింది.
*  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సెన్సార్ నుంచి A సర్టిఫికేట్ లభించింది. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు.
*  కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే 'భారతీయుడు 2' చిత్రం తొలి షెడ్యూల్ తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడుకి, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారికి బడ్జెట్టు విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో ఇది ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. ఇటీవల వీరు కూర్చుని మాట్లాడుకున్నారని, పరిమితమైన బడ్జెట్టులో పూర్తి చేయడానికి దర్శకుడు అంగీకరించాడనీ, ఆగస్టు నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందని తాజా సమాచారం
Rakul
Puri Jagannadh
Ram
Kamalahasan

More Telugu News