Chandrababu: చంద్రబాబు, లోకేశ్ దోచుకున్నవన్నీ బయటకు తీస్తాం: ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా

  • టీడీపీ హయాంలో భూ కేటాయింపులు, రాయితీల్లో దోచుకుంది
  • ఆ భూములను న్యాయబద్ధమైన పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తాం
  • అందుకు తగు చర్యలు చేపడతాం
ఏపీలో గత ప్రభుత్వంపై ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా ఆరోపణలు గుప్పించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం భూ కేటాయింపుల్లో, రాయితీల్లో చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్ దోచుకున్నారని ఆరోపించారు. వాళ్లిద్దరూ దోచుకున్న వాటన్నింటినీ బయటకు తీస్తామని అన్నారు. కచ్చితంగా, న్యాయబద్ధమైన పారిశ్రామికవేత్తలకు ఆ భూములను కేటాయించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో ఏపీలో పరిశ్రమలు స్థాపించాలని వచ్చిన పెట్టుబడిదారులు ఇక్కడ ఏర్పాటు చేయడం కంటే బీహార్ లో చేయడం సులభమని, ఇక్కడ ఉన్నంత అవినీతి ఎక్కడా లేదని అన్నారని రోజా వ్యాఖ్యానించారు.
Chandrababu
Nara Lokesh
Telugudesam
YSRCP
Roja

More Telugu News