Andhra Pradesh: టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ అరాచకాలకు పాల్పడుతోంది: బీజేపీ నేత కన్నా

టీడీపీ, వైసీపీలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ అరాచకాలకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. గ్రామ వాలంటీర్ల పేరుతో మరో జన్మభూమి కమిటీకి తెరలేపారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోందని అన్నారు. ఏపీలో 25 లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. 2024 నాటికి ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
bjp
kanna

More Telugu News