Andhra Pradesh: ఏపీలో ఇద్దరు రైతుల ఆత్మహత్య

  • ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఘటనలు
  • అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
  • ఆయా ఘటనలపై కుటుంబసభ్యుల ఆవేదన
అప్పుల బాధ తాళలేక ఏపీ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని బి.చెర్లోపల్లిలో రైతు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

మరోపక్క, అనంతపురం జిల్లాకు చెందిన మరో రైతు కురుబ సుబ్బారాయుడు (49) కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండ మండలంలోని ఆమిద్యాలకు చెందిన సుబ్బారాయుడు అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. పొలానికి వెళ్లి అక్కడ పురుగుమందు తాగాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయా ఘటనలపై వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh
prakasam
anathapuram
farmers

More Telugu News