accident: యువతి ప్రాణాలు బలిగొన్న టిక్‌ టాక్‌ వీడియో

  • చిత్రీకరణ చేస్తూ సంపులో పడిన యువతి
  • నిండా నీరు ఉండడంతో మునిగిపోయి మృతి
  • చదువులో ముందుండే విద్యార్థిని
టిక్‌ టాక్‌ వీడియో చిత్రీకరణ ఓ యువతి ప్రాణం మీదికి తెచ్చింది. చిత్రీకరణలో పడిపోయి ప్రమాదాన్ని ఊహించకపోవడంతో లోతైన సంపులోకి జారిపడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని బెంగళూరుకు డెబ్బయి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్‌ ప్రాంతానికి చెందిన మాలా (20) డిగ్రీ చదువుతోంది. చదువులో ముందుండే మాలా ఇటీవల ప్రభుత్వం నుంచి రూ.10 వేలు ఉపకార వేతనం కూడా తీసుకుంది.

సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఏక్టివ్‌గా ఉండే మాలా టిక్‌ టాక్‌కు ఆకర్షితురాలైంది. ఇందుకోసం ఓ వీడియో చిత్రీకరించాలని భావించి ఇంటి వెనుక ఉన్న నీటి సంపు వద్ద వీడియో చిత్రీకరణ చేస్తోంది. సంపునకు  పూర్తి స్థాయిలో కప్పు లేకపోవడంతో వీడియో తీస్తూ నడుచుకుంటూ వెళ్లి అందులో పడిపోయింది. సంపులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో మునిగి ఊపిరాడక మృతి చెందింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు భోరుమన్నారు.
accident
tik talk
girl sliped in to shamp
died
vedio shooting

More Telugu News