Rashmika Mandanna: రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక

  • వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక
  • కోటి రూపాయలకు రెమ్యునరేషన్ పెంచేసిన కన్నడ భామ
  • ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తున్న రష్మిక
కన్నడ భామ రష్మిక మందన్న వరుస హిట్లతో దూసుకుపోతోంది. వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. టాప్ హీరోయిన్ గా మారిపోవడంతో, తాజాగా తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసింది. 'గీత గోవిందం' సినిమాకు రూ. 60 లక్షలు తీసుకున్న రష్మిక... కన్నడలో చేసిన ఓ చిత్రానికి రూ. 64 లక్షలు తీసుకుంది. ఇప్పుడు మహేశ్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ సినిమాకు ఆమె రూ. కోటి తీసుకున్నట్టు తెలుస్తోంది.

విజయ్ సరసన రష్మిక నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. తెలుగులో మూడు, కన్నడలో ఒక చిత్రం, తమిళ్ లో ఒక చిత్రంలో రష్మిక నటిస్తోంది.
Rashmika Mandanna
Tollywood
Remuneration

More Telugu News