Chandrababu: ప్రతి దానికి నాపై విచారణ జరిపించాలని ప్రయత్నిస్తున్నారు: చంద్రబాబు

  • రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాం
  • వైసీపీ కూడా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు యత్నించాలి
  • నాపై విమర్శలు చేయడం మానుకోవాలి
రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే తాను విదేశీ పర్యటనలు చేపట్టానని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ కూడా అనేక దేశాల్లో పర్యటించారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డామని తెలిపారు. వైసీపీ కూడా పెట్టుబడులను తీసుకొచ్చేందుకు యత్నించాలని... వృథా ఖర్చు అని విమర్శించడం సరికాదని అన్నారు. తనపై విమర్శలు చేయడం మానుకోవాలని... మీ వెనుక ఉన్నవి చూసుకోవాలని చెప్పారు. ప్రతి దానికి తనపై విచారణ జరిపించాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలిపామని చెప్పారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News