Prakasam District: మాజీ ఎమ్మెల్యే ఆమంచి సోదరుడి కుమారుడిపై అట్రాసిటీ కేసు నమోదు

  • హోంగార్డు రవికుమార్‌కు ఫోన్ చేసి బెదిరించిన రాజేంద్ర
  • సీఐ బేతపూడి ప్రసాద్‌పైనా అనుచిత వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో తిట్లు వైరల్
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు శ్రీనివాసరావు (స్వాములు) కుమారుడు రాజేంద్రపై చీరాల టూటౌన్‌ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈవూరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రవికుమార్ రెడ్డికి ఇటీవల ఫోన్ చేసిన రాజేంద్ర బెదిరించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషించాడు. గతంలో చీరాల రూరల్ సీఐగా పనిచేసిన బేతపూడి ప్రసాద్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రవికుమార్‌ను బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేంద్రపై ఆదివారం బేతపూడి ప్రసాద్ చీరాల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో టేపులను పోలీసులకు అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు రాజేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Prakasam District
chirala
Amanchi krishnamohan
atrocity act

More Telugu News